ST Hostel | విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ST Hostel | విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

  • గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఘ‌ట‌న‌
  • ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్న వైద్యులు

ST Hostel | గద్వాల (ప్రతినిధి) ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఈ ఉదయం సుమారు 12మంది నుంచి 15మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయినా సుమారు 15మంది విద్యార్థుల (15 students)ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం(medicine) అందిస్తున్నారు.

ఈరోజు ఉదయం 8.00 గంటల సమయంలో విద్యార్థులు హాస్టల్లో ఉప్మా(upma) తిన్నారని, మరికొందరు అరటి పండ్లు, బిస్కెట్లు తిన్నారని, అవి తిన్న తర్వాత స్కూల్ కు వెళ్ళిన అరగంటకే కళ్ళు తిరగడం, మబ్బులు రావడంతో వాంతులు(vomitings) కావడాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్(hostel warden) కు విష‌యం తెల‌ప‌డంతో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

ఫుడ్ పాయిజ‌న్ పై విద్యార్థులు మాట్లాడుతూ… ఉద‌యం త‌మ‌కు పెట్టిన ఉప్మాలో పురుగులు వ‌చ్చాయ‌ని, ఈ విషయాన్ని వార్డెన్ కు తెలిపామ‌న్నారు. అయితే ఆ ఉప్మాను ప‌డేసి… ఆ తర్వాత అరటి పండ్లు, బిస్కెట్లు(Bananas and biscuits) ఇవ్వడంతో అవి తిని స్కూల్ వెళ్ళిన అరగంటకే(Half an hour) వాంతులు కావ‌డం, క‌ళ్లు మబ్బులు రావడం, కడుపు నొప్పి రావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు.

Leave a Reply