Suchitra X Roads| ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలి

Suchitra X Roads| సుచిత్ర–మేడ్చల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిరవధికంగా నిలిచిపోవడంతో ప్రాంతీయ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సుచిత్ర ఎక్స్‌రోడ్స్ వద్ద మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు.
ఫ్లైఓవర్ పనులను వెంటనే పునఃప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ నిరసనలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు.
ధర్నా సందర్భంగా భరత్ సింహ రెడ్డి బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌తో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఫ్లైఓవర్ నిర్మాణం నిలిచిపోవడంతో ప్రతి రోజు జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ కష్టాలు, ప్రమాదాలు, అసౌకర్యాలు ఎదుర్కొంటున్నట్లు ఎం.పికి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఈటల రాజేందర్, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమస్యను తీసుకెళ్లారు.
తదుపరి, నితిన్ గడ్కరీ – ఈటల రాజేందర్ కలిసి ఎన్‌హెచ్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి సుచిత్ర–మేడ్చల్ హైవే, ఫ్లైఓవర్ పనులను తక్షణమే వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎం.పి సమాచారం అందించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఫ్లైఓవర్‌తో సహా అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయించేందుకు నిరంతరం కృషి చేస్తామని మెట్రో సాధన సమితి సభ్యులకు భరత్ సింహ రెడ్డి హామీ ఇచ్చారు.
