Flying Squad | ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్…

Flying Squad | ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్…
Flying Squad | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ పట్టణంలోని సుదర్శన్ టాకీస్, ముచ్కూర్ చౌరస్తా బడా భీమ్‌గల్ చౌరస్తా,సబ్ స్టేషన్, బడా భీమ్‌గల్ రోడ్ బ్రిడ్జ్,ముచ్కూర్ ఎక్స్ రోడ్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో సందర్భంగా మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కట్టడి చేయడం జరిగింది.ఈ సందర్భంగా వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలని వాహనదారులకు అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి పై ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అశ్విన్ బాబు, ప్రత్యేక తనిఖీ చేపట్టారు.రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్లాల్సి వస్తే, సంబంధిత రసీదులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, లేకపోతే నగదును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా సమాచారం ఇస్తే, వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, పోలీస్ సిబ్బంది, రాజశేఖర్, గోపాల్, వీడియో గ్రాఫర్ లో, తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
