మానేరు జలాశయానికి వరద
దిగువకు నాలుగువేల క్యూసెక్కుల నీటి విడుదల
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో ఆంధ్రప్రభ : మెంథా తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోయర్ మానేరు జలాశయం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా జలాశయం సామర్థ్యం నిండడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తిస్థాయి 24 టీఏంసి ల నీరు పూర్తి స్థాయిలో నిండడంతో రెండు గేట్లను ఎత్తి నాలుగువేల క్యూసెక్కుల నీటినీ దిగువకు వదులుతున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే నీటి ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

