Flag March | ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి…

Flag March | ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి…

Flag March | ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకునేలా ప్రజలు సహకరించాలని ధర్మపురి. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలపాటి రాంనర్సింహరెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వుల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సూచనతో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి నేతృత్వంలో ధర్మపురి ఎస్ ఐ మహేష్, సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి నేరేళ్ల, రాయపట్నం గ్రామంలో ఫ్లాగ్ మార్చి(March the flag) నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎలక్షన్స్(Elections) ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అందరూ ఓటు హక్కునీ సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎస్ఐ పులిచెర్ల ఉదయ్ కుమార్, గొల్లపల్లి ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి, బుగ్గరం సతీష్ , ధర్మపురి రెండవ ఎస్ఐ రవీందర్ కుమార్ మరియు సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply