flag | బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే తాతయ్య

flag | బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే తాతయ్య
- అమరావతిలో జరిగే ముఖ్యమంత్రి సమావేశానికి జగ్గయ్యపేట నుంచి బయలుదేరిన ప్రతినిధులు
flag | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : అమరావతి హైకోర్టు సమీపంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశానికి జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన సాగునీటి సంఘాల అధ్యక్షుల వాహనాన్ని శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులకు నీటి వనరులు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ద్వారా సాగునీటి సంఘాలకు మరింత బలమిచ్చే నిర్ణయాలు వెలువడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దూళిపాళ్ల లక్ష్మణరావు, కానూరి కిషోర్, పొన్నం బాలాజీ, కళ్యాణం సూర్యప్రకాశ్, పెంటేల నరేష్, కట్టా నవీన్, కొత్తపల్లి రాజు, చెరుకూరి శ్రీను, పద్మాల వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షుడు పెద్ద సంఖ్యలో అమరావతికి తరలివెళ్లి సమావేశంలో పాల్గొననున్నారు.
