Five feet water | యాసంగి పంటకు సాగునీరు విడుదల…

Five feet water | యాసంగి పంటకు సాగునీరు విడుదల…

Five feet water | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామ శివారులోని ఊర చెరువుకు 2026 2027 సంవత్సరానికి గాను యాసంగి పంటకు తైబంది నిర్వహించ నైనది, మండల రెవెన్యూ అదనపు అధికారి ముగ్దుంపురం జిపిఓ తో సమూహంగా వెళ్లి ఇట్టి తైబంది చేయుటకు గాను గ్రామంలోని పూర్వపు పెద్దలు, గ్రామ ప్రజలు ఆయకట్టు రైతులు సమూహంగా ముద్దుoపురం గ్రామంలోని ఊర చెరువు వద్దకు వెళ్లి తూము వద్ద నీటి మట్టంను కొలిచి పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఊర చెరువు వంపు తూము నీటిమట్టం ఐదు ఫీట్లు నీరు చెరువులో ఉన్నట్లుగా గ్రామస్తులు ఆయకట్టు దారులు నిర్ధారించారు. వంపు తూము కింద గల నీటితో ప్రతి సంవత్సరం విధంగానే రోటేషన్ పద్దతిలో 50 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం వరి నాటు వేసినచో నీళ్లు పారుతాయ‌ని గ్రామస్తులు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు.

పశువులు త్రాగ‌టానికి కూడా నీళ్లు మిగులుతాయ‌న్నారు. ఈ యాసంగి పంటకు ఊర చెరువులోని ఐదు ఫీట్ల నీటి(Five feet of water)తో కొత్తపెళ్లి ప్రభాకర్ రావు పొలం నుండి గొర్రె బిక్షపతి పొలం వరకు 50 ఎకరాలు వరి సాగు అవుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఆయకట్టు రైతులకు యాసంగి నీటిని వ‌దులుట‌కు తైబంది చేసి మండల రెవిన్యూ అధికారులు గ్రామస్తుల ముందు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఊర చెరువు కట్టపై చెరువు శిఖంలో ఎవరైనా రైతులు కరెంటు మోటారు పెట్టి నీటిని తోడకూడ‌ద‌న్నారు. ఈ నీటిని ఎవరైనా అక్రమంగా తోడినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్ల మల్లారెడ్డి. చల్ల రామచంద్రారెడ్డి. చల్ల యుగంధర్ రెడ్డి. చంద్రయ్య. చీకటి ఓదెలు, తదితర ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply