చోరీ కేసులో ఐదుగురు అరెస్టు

చోరీ కేసులో ఐదుగురు అరెస్టు
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్(Narsampet Division)లోని వివిధ మండలాల్లో పదికి పైగా దొంగతనాలకు పాల్పడినట్లు ఐదుగురిని పోలీసులు(Police) పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా ఇద్దరు పురుషులు ఉన్నారు.
ఈ రోజు ఉదయం హెల్త్ చెకప్(Health Checkup) కోసం నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని పోలీసు అధికారుల సమాచారం. ఎంత సొత్తు స్వాధీనం(Seizure) చేసుకున్నారో సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది.
