First women | ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్ చైర్మన్

First women | ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్ చైర్మన్
ఆకాశంలో సగమే కానీ
అధికారం మొత్తం మాదే!
మహిళలను అందలమెక్కించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
వైస్ చైర్మన్ దక్కకపోవడంతో అలక వహించిన ఒడ్డేపల్లి రాజలింగయ్య
లక్షేట్టిపేట మున్సిపాల్ చైర్ పర్సన్, వైస్ చైర్ చైర్మన్ గా విజయం సాధించిన తొలి మహిళలు
First women | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభః ఆకాశంలో సగం తాను,ఆది పరాశక్తి అనే స్వరూపానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిక ప్రాధాన్యతనిచ్చి,తన స్వంత పార్టీ మగధీరులకు ఘలక్ ఇచ్చారు. లక్షేట్టిపేట మున్సిపల్ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో ఇద్దరూ మహిళలకే చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టి అందరినీ హౌరా అనిపించారు. లక్షేట్టిపేట మున్సిపాల్ చెర్మన్ వైస్ చెర్మన్ గా విజయం సాధించిన తొలి మహిళలుగా వీళ్లు గుర్తింపు పొందారు.
మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డ్ లుండగా 11 కాంగ్రెస్, 3 బీ ఆర్ ఎస్, 1 బీజేపీ గెలుపొందాయి. సంపూర్ణ మెజారిటీ ఉండటంతో మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం వార్డ్ కౌన్సిలర్స్, మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం సంప్రదాయబద్ధoగా జరిగింది.
1 వ వార్డ్ నుంచి కౌన్సిలర్ సిద్ధార్థ, 2 వ వార్డ్ నుంచి చైర్ పర్సన్ గా దొంత అంజలి, 3 వ వార్డ్ పెట్టెం తిరుపతి (బీ ఆర్ ఎస్ ), 4 వ వార్డ్ నుంచి వైస్ చైర్మన్ గా మోత్కూరి రాజేశ్వరి, 5 వ వార్డ్ శనిగారపు చిన్నయ్య, 6 వ వార్డ్ తోట సువర్ణ, 7వ వార్డ్ రాజేంద్ర ప్రసాద్, 8 వ వార్డ్ జమున(బీ ఆర్ ఎస్ ), 9 వ వార్డ్ రాజలింగయ్య , 10 వ వార్డ్ పెండెం పద్మ, 11 వ వార్డ్ సూరం చంద్రమౌళి, 12 వ వార్డ్ పర్వీన్ సుల్తానా, 13వ వార్డ్ బిరుదుల సత్యనారాయణ, 14 వ వార్డ్ మైలారపు సుధాకర్(బీ ఆర్ ఎస్ ), 15 వ వార్డ్ గోప సుజాత లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.కాగా, 9 వ వార్డ్ కౌన్సిలర్ ఒడ్డేపల్లి రాజలింగు, 11 వ వార్డ్ కౌన్సిలర్ సూరం చంద్రమౌళి, 12 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ సుల్తానా -ఆరీఫ్ లు వైస్ చైర్మన్ పదవి ఆశించి భంగపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాణ స్వీకారం అనంతరం వడ్డేపల్లి రాజలింగయ్య అసంతృప్తితో విలేకరులతో మాట్లాడకుండానే బాధతో వెళ్లిపోయారు.

