First Result | మక్తల్ లో తొలి ఫలితం… బీఆర్ఎస్ ఖాతాలోకి..

First Result | మక్తల్ లో తొలి ఫలితం… బీఆర్ఎస్ ఖాతాలోకి..

First Result | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ మూడవ విడత ఎన్నికల పోలింగ్ (Election Polling) అనంతరం ఓట్ల లెక్కింపులో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారు గాల్ రెడ్డి 30ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు కొత్తమాలే సురేందర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. 527 ఓట్లు పోల్ కాగా.. గాల్ రెడ్డికి 236 ఓట్లు రాగా, సురేందర్ రెడ్డికి 207 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డికి 78 ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి గాల్ రెడ్డి 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Leave a Reply