First prize | ఆటల పోటీల్లో నారా దేవాన్ష్‌కు మొదటి బహుమతి

First prize | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మనవడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ బహుమతి అందుకున్నాడు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా వీక్షించారు.

వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజేతగా నిలిచిన నారా దేవాన్ష్ ను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి ప్రశంసించి అభినందించారు. పోటీల్లో గెలుపొందిన కొటాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులను చంద్రబాబు అభినందించి బహుమతులు అందజేశారు. ఆటల పోటీలను పకడ్బందీగా నిర్వహించిన ఫిజికల్ డైరెక్టర్లను అభినందించి సీఎం చంద్రబాబు బహుమతులు అందజేశారు.

Leave a Reply