First match | టీ20 సిరీస్‌‌కు రెడీ..

First match | టీ20 సిరీస్‌‌కు రెడీ..

  • ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు
  • బుధ‌వారం తొలి మ్యాచ్‌
  • నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం

First match | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : స్వ‌దేశంలో టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. న్యూజిలాండ్‌పై వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్వదేశంలో తొలిసారి సిరీస్ ఓడిపోయింది. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి మ్యాచ్‌ కోల్పోవడంతో వన్డే సిరీస్ కూడా భారత్ చేజారిపోయింది. 2-1తో సిరీస్ కివీస్ కైవసం చేసుకుంది. ఇక న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న 5 మ్యాచుల టీ20 సిరీస్‌పై టీమిండియా దృష్టిసారించింది.

First match

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 బుధవారం (జనవరి 21) జరగనుంది. వరల్డ్ కప్ ముందు ఇరు జట్లకు ఇదే ఇరు జట్లకు చివరి సిరీస్. జనవరి 21 నుంచి జనవరి 31 వరకు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఇండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టును మిచెల్ సాంట్నర్ లీడ్ చేయనున్నాడు. ఇండియాపై సిరీస్ గెలుచుకున్న కివీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు టీ20ల్లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమిండియా సిరీస్ నెగ్గుతామనే ధీమాగా కనిపిస్తోంది.

First match

ఇండియా, న్యూజిలాండ్ టీ20 షెడ్యూల్:
బుధవారం (జనవరి 21): తొలి టీ20: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
శుక్రవారం (జనవరి 23): రెండో టీ20: షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
ఆదివారం (జనవరి 25): మూడో టీ20: బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతి
బుధవరం (జనవరి 28): నాలుగో టీ 20:వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
శనివారం (జనవరి 31): ఐదో టీ20: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

ఇండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషాన్

న్యూజిలాండ్ స్క్వాడ్:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి

CLICK HERE TO READ నీ వ‌ల్ల.. ఏం ఉప‌యోగం లేదు..

CLICK HERE TO READ MORE

Leave a Reply