హైదరాబాద్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
దీంతో మొదటి అంతస్తు వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్భంది.. మొదటి అంతస్తులో చిక్కుకున్న పలువురిని స్థానికుల సహాయంతో కాపాడారు. భవనం పైనుంచి తాళ్ల సహాయంతో పలువురిని రెస్క్యూ చేశారు.. అయితే దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.