Fire Accident |ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం : లండన్ విమానాశ్రయం మూసివేత

లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ విమానాశ్రయానికి కూడా ఈ సబ్‌స్టేషన్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు హీత్రో ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితులు అనుకూలించడం లేదని పేర్కొన్నారు.

విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో.. సమీపంలోని ఇళ్లల్లో చీకట్లు అలముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడానికి 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *