FILM | ఘనంగా ప్రారంభమైన చిత్రోత్సవం…
Telangana-North East Connect చిత్రోత్సవం ప్రారంభం
FILM | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘Telangana–North East Connect’ రెండు రోజుల చిత్రోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రారంభించి, త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్’ తొలి ప్రదర్శనను వీక్షించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఫాదర్ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాలు–తెలంగాణల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, యువశక్తి, మహిళా సాధికారత, ఐటీ, ఆరోగ్య రంగాల్లో(In health fields) విస్తృత భాగస్వామ్యానికి ఈ వేదిక దోహదపడుతుందన్నారు. “సినిమా సరిహద్దుల్లేని భాష… ప్రాంతాలను, జాతులను కలిపే మాధ్యమం” అని పేర్కొన్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా తెలుగు సినిమా దూర గ్రామాల వరకూ చేరి అపార ఆదరణ పొందుతుందనడం సినీ శక్తికి నిదర్శనమన్నారు.

ఈశాన్య రాష్ట్రాల కథలు, సంస్కృతి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ – ఈ చిత్రోత్సవం సహ – నిర్మాణాలు, సాంకేతిక మార్పిడి (Technology Transfer) సృజనాత్మక ప్రయోగాలకు దారితీస్తుందని చెప్పారు. సృజనాత్మకతకు కేంద్రంగా ముందుకు సాగుతున్న హైదరాబాద్‌కు ఇది రెండు ప్రాంతాల సినీ ప్రపంచాల మధ్య దీర్ఘకాలిక బంధాలకు పునాది వేస్తుందన్నారు.
ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ప్రియాంక అతిథులను స్వాగతిస్తూ, తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా త్రిపుర, మణిపూర్, అస్సాం, మెఘాలయ, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల (Telangana States) నుండి ఎంపిక చేసిన పన్నెండు చిత్రాలను రెండు రోజులపాటు ప్రదర్శిస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ అవార్డు పొందిన చిత్రాలతో పాటు తెలంగాణ గ్రామీణ జీవనవిధానం, కళాశైలులు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ‘నా బంగారు తల్లి’, ‘పొట్టేల్’, ‘మల్లేశం’, ‘బలగం’ వంటి చిత్రాలను క్యూరేట్ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు (Ministers) కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, టీజీఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్ కిషోర్ బాబు, అదనపు డైరెక్టర్ డి.ఎస్. జగన్, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, దర్శకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

