సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీ రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసానిని హైదరాబాద్ నుంచి అనంతపురం తరలించనున్నారు పోలీసులు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్టు సమాచారం. క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద నోటీసు జారీ చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు
తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదం చేశారు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు పోసాని . ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్ట్ చేస్తున్నామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆయనను కారులో ఏపీకి తీసుకొని వెళ్లారు.