రిజర్వేషన్ల కోసం పోరాటాలు

రిజర్వేషన్ల కోసం పోరాటాలు

సదాశివనగర్, ఆంధ్రప్రభ : 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ రోజు మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక సభ్యులు విలేకరులతో వారు మాట్లాడుతూ.. బీసీల జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

కొన్ని సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరుగుతున్నాయని, రాజకీయ లబ్ధి కోసమే బీసీలను వాడుకుంటున్నారని, రిజర్వేషన్లు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉందన్నారు. స్థానిక సంస్థల్లో 50% పరిమితిని(50% limit) ఎత్తివేసి బీసీలకు రావలసిన రిజర్వేషన్లు(reservations) అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బొంబాయి మల్లయ్య(Bombay Mallaiah), మాజీ ఎంపీటీసీ పాపనోళ్ల బీరయ్య, మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి, మాజీ వార్డు సభ్యుడు పెసరి సాయిలు, ఐక్యవేదిక సభ్యులు మాణిక్యం దేవదాస్, పోలబోయిన సాయిలు, జోగిని ఎల్లయ్య, కుప్రియాల బాబయ్య, కొత్తింటి నర్సింలు, తోకల సాయిరాం, పున్నం రాజయ్య, డా.గణేష్, ఏంపేట సాయిలు, పోసాని బైరు, తోకల లింగం, దువ్వల భాస్కర్, కొమురయ్య, మంగలి దత్తు, పెద్దొల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply