Fertilizer | రైతులకు యూరియా కష్టాలు ఉండవు

Fertilizer | రైతులకు యూరియా కష్టాలు ఉండవు
- యాప్ ద్వారా యూరియా పంపిణీ
- మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్
Fertilizer | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఇక నుంచి రైతులకు యూరియా కష్టాలు ఉండవని నర్సింహులపేట మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ అన్నారు. ఈ రోజు రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రబీసీజన్ నుండి రైతులకు ఫెర్టిలైజర్(Fertilizer) బుకింగ్ యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రైతుల ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి మూడు నుండి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్(slot booking) ద్వారా ఎరువులు పొందే అవకాశం ఉందన్నారు. మండలంలోని రైతులు ఈనెల 20వ తారీకు నుండి యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల నుండి 24 గంటలలో యూరియా(urea)ను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మౌనిక,కళ్యాణి,రైతులు పాల్గొన్నారు.
