strike | ‘ఫీజు పోరు దీక్ష’

ఇందిరాపార్క్ వ‌ద్ద ఆందోళ‌న‌

రీయంబర్స్‌మెంట్ బకాయిల విడుదల చేయాలి
విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల ధ‌ర్నా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ధర్నా, ‘ఫీజు పోరు దీక్ష’ చేపట్టారు. బకాయిల వల్ల ఇంజినీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే నిధులు విడుదల చేయాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు నిలిచిపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఈటల రాజేందర్, మధుసూదనాచారి, బండారు దత్తాత్రేయ, దర్శకుడు శంకర్ వంటి ప్రముఖులు సంఘీభావం తెలిపారు.

Leave a Reply