కేసు నమోదైందనే భయంతో..

కేసు నమోదైందనే భయంతో..

వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కొట్ర గేట్ సమీపంలో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (27) గురువారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు. ఇది గమనించిన వ్యవసాయదారుల సమాచారం మేరకు.. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.

గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని.. దీంతో భయాందోళనకు గురై ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని అనుమానించారు. మృతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నట్టు తెలిపారు.

Leave a Reply