Hanumakonda | ఘోర రోడ్డు ప్ర‌మాదం

Hanumakonda | ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు


Hanumakonda | ఆత్మకూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (road accident) లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం… పరకాల నుండి హనుమకొండ (Hanumakonda) కు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి కొత్తగట్టు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రేగొండ మండలం రేపాకపల్లి గ్రామానికి చెందిన పర్షా సంపత్ (చంద్రయ్య), పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొంపల్లి కృష్ణ (సంపత్ రావు) అక్కడికక్కడే మృతి చెందారు.

కారు (car) లో ప్రయాణిస్తున్న చింతపట్ల మురళీకృష్ణ (ఆత్మకూరు), పోతరాజు వెంకటేష్, రాజు (కామరెడ్డిపల్లి) తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రి (MGM Hospital) కి తరలించగా, గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆత్మకూరు సిఐ సంతోష్ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ పేర్కొన్నారు.

Leave a Reply