AP | నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
తిరుపతి: నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై జాతీయ రహదారిపై బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతి రుయూ ఆస్పత్రికి తరలించారు. మరణించినవారిలో రాజేంద్ర నాయుడు, పార్థసారథి నాయుడు ఉన్నారు, అయితే మరొకరికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.