యాదాద్రి : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం (Choutuppal Mandal) లోని ఖైతాపురం వద్ద హైవేపై కారు ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు (police) వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు (Assistive measures) చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు (DSPs) మేక చక్రధర్ రావు (Meka Chakradhar Rao), శాంతారావు (Shantharao) గా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో వారు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ (andhra pradesh) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
