మార్టూరు( ఆంధ్రప్రభ): బాపట్ల(Bapatla) జిల్లాలో ఆదివారం(Sunday) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుక్క(dog)ను తప్పించబోయిన కారు(car) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందినవారు మృతిచెందారు.
జిల్లాలోని మార్టూరు(Martur) మండలం కోలలపూడి(Kolalapudi) వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసుల(police)కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు లక్ష్మణ్(Lakshman) (70), సుబ్బాయమ్మ(Subbayamma)(65), హేమంత్(Hemant) (25)గా గుర్తించారు. తిరుపతి(Tirupati) నుంచి పిఠాపురాని(Pithapuram)కి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

