వికారాబాద్, జులై 21 (ఆంధ్రప్రభ): గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం రైతన్నలకు యూరియా (Urea) అత్యవసరంగా అవసరముంది. అధికారులు (Officers) ఎటువంటి యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో రైతులు (Farmers) యూరియా దొరక్క ఇబ్బందుల పాలవుతున్నారు.
వికారాబాద్ (Vikarabad) పట్టణంలో సోమవారం ఉదయం పలు ఫర్టిలైజర్ షాప్ (Fertilizer Shop) వద్ద రైతులు బారులు తీరిన సంఘటన చోటుచేసుకుంది. పంటలకు సరిపడా వర్షాలు కురియడంతో రైతులు తమ పంట పొలాల్లో యూరియా వేసేందుకు పట్టణాలకు వచ్చి షాపుల వద్ద పడి కాపులు కాస్తున్నారు.