ADB | యూరియా కోసం ప్రధాన రోడ్డుపై రైతుల‌ ధర్నా

జైనూర్, జులై 8 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ప్రభుత్వం యురియా (Urea) ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ (Jainur) మండల కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తాలో గల ప్రధాన రోడ్డు ఫై రైతులు (Farmers) ధర్నా చేశారు. ప్రభుత్వం రైతులకు యూరియా ఎరువులు సక్రమంగా సరపర చేయడం లేదని ఎన్నికలకు ముందు మాత్రం రైతులకు సరిపడే ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని రైతులు పేర్కొన్నారు.

వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా ఎరువులను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలాసేపు ధర్నా చేయడంతో వాహనాలు రాకపోకలు సంభవించడం వల్ల పోలీసులు వచ్చి రైతులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు. ఈ ధర్నాలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Leave a Reply