రైతుల ధర్నా..

రైతుల ధర్నా..

సంస్థాన్ నారాయణపురం ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లచ్చమ్మ గూడెం గ్రామంలో కరెంటు కోతల పై రైతులు సబ్ స్టేషన్ ముట్టడి చేసి ధర్నా చేశారు. కరెంటు కోతలతో ఆరుగాలం పండించిన పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కోర్ర తండా రైతులు విద్యుత్ అధికారులను నిలదీశారు. సబ్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సదుపాయం అందిస్తానని మోసం చేసిందని ఇకనైనా సకాలంలో కరెంటును అందించి మా పొలాలను కాపాడాలని రైతుల డిమాండ్ చేశారు.

Leave a Reply