Farmer | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Farmer | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

Farmer | ఎ.కొండూరు ( ఎన్టీఆర్ జిల్లా) , ఆంధ్రప్రభ) : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎ.కొండూరు మండలం మారేపల్లి గ్రామంలో శనివారం మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేలో భాగంగా గ్రామంలోని 765 మంది రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతుకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో పాసుపుస్తకాలపై జగన్ బొమ్మను ముద్రించారని తాము మాత్రం నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు.అలానే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళుతుందని ఒకపక్క రాజధాని నిర్మాణం మరోపక్క రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుందన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమంతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల రూపకల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలానే మండలంలోని 31 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన కృష్ణా జలాలు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి గ్రామ సర్పంచ్ తాళ్లూరి నాగేశ్వరరావు. మండల డిప్యూటీ తహశీల్దార్ అరవింద్, వీఆర్వో మధుబాబు, రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి,వనపర్ల డేవిడ్ రాజు,గిరిజన సంఘం నాయకులు బి.గోపిరాజు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply