Farmer | యూరియా ఆన్ లైన్ యాప్ రద్దు చేయాలి..

Farmer | యూరియా ఆన్ లైన్ యాప్ రద్దు చేయాలి..

  • రైతుల ఆందోళన….

Farmer | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రైతులు ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. యూరియా పంపిణీకి తీసుకువచ్చిన ఆన్లైన్ యాప్ ను రద్దు చేసి, గతంలో మాదిరిగానే సొసైటీలు,ఫర్టిలైజర్ షాపుల్లో యూరియాను అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం డిమాండ్ చేశారు.

యాప్ కారణంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్,భాషా సమస్యలతో రైతులు యూరియాను సకాలంలో పొందలేకపోతున్నారని తెలిపారు. వరి నాట్లు పూర్తై నెల రోజులు గడిచిన యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సానిక తహసిల్దార్ నేలపట్ల నరేష్ కు మెమోరాండం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బండమీది యాదయ్య(చల్మెడ సర్పంచ్), మందుల పాండు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బి.లాలు, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు సతీష్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాస్, దుబ్బ వెంకన్న, ముంత నరసింహ, బైరుగొండ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, బి.నరసింహ, నందిపాటి అశోక్, జి. నరసింహ, సత్యనారాయణ, కట్ట.లాలు, జి.నరేందర్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఉదయ్ కుమార్, కట్కూరి లింగస్వామి, మిర్యాల యాదయ్య, బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply