Fair Nagoba | గంగాజలానికై పయనమైన మెస్రం వంశీయులు…

Fair Nagoba | గంగాజలానికై పయనమైన మెస్రం వంశీయులు…

  • క్రమశిక్షణకు మరో పేరు మేశ్రమ వంశీయులు

Fair Nagoba | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : గిరిజనుల ఆరాధ్య దైవం రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన రెండవ అతిపెద్ద జాతర నాగోబా(Fair Nagoba) తొలిఘట్టం ఆరంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్ లోని మురాడి వద్దకు చేరుకుని సమావేశమయ్యారు. పటేల్ పీఠాధిపతి మేస్రం వెంకట్రావు, చిన్ను, ఖాటోడ (పూజారులు) కోసు, కోసే రావ్, మెస్రం శేఖర్ ల ఆధ్వర్యంలో గంగాజలం కోసం వెళ్ళే దారులపై చర్చించారు.

Fair Nagoba | ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీఠ..

Fair Nagoba |

ఈ సారి గంగాజలానికై పయణించే మెస్రం వంశీయులు ఆచార సంప్రదాయాలను పాటించాలని సూచించారు. ఎలాంటి సెల్ ఫోన్(cell phone) వాడకూడదని, తెల్ల దోతిని మాత్రమే ధరించాలన్నారు. బడి పిల్లలను కుటుంబీకులు తమ వెంట తీసుకుని రాకూడని ఏక గ్రీవంగా తీర్మానించారు. సాంప్రదాయ పూజల అనంతరం గంగాజలానికి వెళ్ళే ఖటొడ గౌరీ గ్రామానికి చెందిన (పూజారి) హనుమంతరావు వీపుకు తెల్లటి బట్టతో కలశం(ఝారి) ను కట్టి సాగనంపారు.

Fair Nagoba |

30. 12. 2025 మంగ‌ళ‌వారం ఇంద్రవెల్లి మండలం కేసులగూడ బయలు దేరి రాత్రి బస చేస్తారు. 31.12, 2026 బుధవారం రోజు ఇంద్రవెల్లి(Indravelli) మండలం ఛీలాటి గూడలో బసచేసి, 1′ 1 2026 గురువారం రోజున నర్నూర్ మండలం మార్కాపూర్ లో బస చేస్తారు. 2 1.2026 శుక్రవారం రోజు జైనూర్ మండలంలోని మామడా మ‌కాం చేసి, 3.1.2026 శుక్రవారం నాడు జై నూర్ మండలంలో డబోలి బస చేసి, 4.1.2026 ఆదివారం సిర్పూర్ యు మండలంలోని ధనురాలో బస చేస్తారు.

5 1.2026 సోమవారం రోజున‌ జన్నారం మండలంలోని ఇస్లాంపూర్‌(Islampur)లో బస చేసి, 6.1.2026 మంగళవారం రోజు జన్నారం మండలంలోని నర్సింగపూర్ 7.1. 2026 రోజు బుధవారం గోదావరిలో I హస్తినమడుగు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగాజలాన్ని సేకరిస్తారు.

Fair Nagoba |

తిరుగు ప్రయాణంలో 7 1.202 ఇదే రోజున‌ ఆయన గంగాజలంతో తిరుగు ముఖం పట్టి జైనూర్ మండలం(Jainur Mandal)లోని పిట్టగూడా కటోడ ఇంట్లో బస చేస్తారు.. జైనూర్ మండలంలోని గౌరీలో బసచేస్తారు. అనంతరం చివరి రోజున 14.1 .26 రోజున‌ ఇంద్రవెల్లి మండలం ఇంద్ర దేవి వద్ద బస చేసి అదే రోజు కేస్లాపూర్ సంక్రాంతి రోజున‌ వస్తారు.

Leave a Reply