Fahad fazil | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సెట్‌లో ఫహాద్ ఫాజిల్ సందడి

Fahad fazil | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సెట్‌లో ఫహాద్ ఫాజిల్ సందడి

  • హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన షూటింగ్
  • ఫహాద్ ఫాజిల్‌కు అభిమానుల ఘన స్వాగతం
  • తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఫహాద్ ఎంట్రీ
  • శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్

Fahad fazil | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఫహాద్ ఫాజిల్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. అయితే.. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) తన మీద అభిమానంతో వ‌చ్చిన ఫ్యాన్స్‌ను చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. అభిమానుల సందోహం మధ్యే ఆయ‌న త‌న షూటింగ్‌ను ప్రారంభించారు. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫహాద్ ఫాజిల్ తన అభిమానుల్ని పలకరించారు.

Fahad fazil

అభిమానుల ప్రేమ, ఉత్సాహాన్ని గుర్తించి అక్కడకు వచ్చిన వారిని హృదయపూర్వకంగా పలకరించాడు. వచ్చిన అభిమానులు ఫహాద్ ఫాజిల్‌ను చూసి ఆనందపడటం, ఫ్యాన్స్‌ని చూసి ఫహాద్ ఫాజిల్ సంతోషించడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. సెట్‌లో సినిమా (Movie) మొదటి రోజు ఓ పండుగ వైబ్ కనిపించినట్టు అయింది. ప్రేమలు సినిమాతో పంపిణీదారుగా ఎస్ ఎస్ కార్తికేయ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక షోయింగ్ బిజినెస్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారారు. అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంతో నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు.

Fahad fazil

భారతదేశం, ప్రపంచ వ్యాప్త సినీ అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారణాసి చిత్రానికి కార్తికేయ వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలను మళ్లీ ఈ చిత్రం ఒకచోటకు చేర్చినట్టు అయింది. డైరెక్ట‌ర్ (Director) శశాంక్ యేలేటి ఈ మూవీని బలమైన భావోద్వేగ అంశాలు, కంటెంట్ బేస్డ్‌గా, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ఫహాద్ ఫాజిల్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ కానున్నారు. రిఫ్రెషింగ్, ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేలా సినిమాని రూపొందిస్తున్నారు.

Fahad fazil

సెట్స్ నుండి వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ యేలేటి, నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ (karthikeya) అభిమానులను పలకరిస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నాటికి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్దంలో గ్రాండ్‌గా థియేట్రికల్ విడుదల చేయడానికి టీం ప్లాన్ చేస్తోంది.

CLICK HERE TO READ విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply