F-35B bomber | అత్యంత ఖరీదైన యుద్ధ విమానం..చివ‌రికి గాల్లోకి లేచింది..

తిరువ‌నంత‌పురం – సాంకేతికంగా తిరువ‌నంత‌పురం విమానాశ్రయంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన అత్యంత ఖరీదైన యుద్ధ విమానం నేడు గాల్లోకి లేచింది. 37 రోజుల తర్వాత యుద్ధ విమానం తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైంది. తొలుత ఈ యుద్ధ విమానాన్ని తిరిగి మరమ్మత్తులు చేయడం కష్టమని భావించారు. విడిగా పార్ట్‌లు తీసి తీసుకెళ్లాల్సిందేనని నిపుణులులు తేల్చారు. అయితే ఈ యుద్ధ విమానాన్ని తిరిగి పట్టాలక్కెంచేందుకు యూకే నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి చూశారు. అది సత్ఫలితాల్ని ఇవ్వడంతో ఆ యుద్ధ విమానం తిరిగి గాల్లోకి ఎగిరింది.

అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్‌ 35 ఎపిసోడ్‌ మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడ్డారు. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్‌ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఈ నెల తొలి వారంలో తిరువనంతపురంలో అడుగుపెట్టారు.

ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించడంతో ఆ విమానం విడిభాగాల్ని తొలగించాలనే అంశానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది.

కాగా, బ్రిటన్‌కు చెందిన నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. ఆ క్రమంలోనే జూన్‌ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్‌ 35 ఫైటర్‌ జెట్‌ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌.. ‍ తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్‌ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్‌ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. తాజాగా ఆ యుద్ధ విమానం గాల్లోకి లేపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో యూకే నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read – Parliament | రెండో రోజూ అదే ర‌గ‌డ‌ .. అప‌రేష‌న్ సిందూర్ పై చ‌ర్చ‌కు విప‌క్షాల ప‌ట్టు

అత్యంత ఖరీదైన విమానం..

F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్‌ జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, బ్రిట‌న్, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ లాక్ హిడ్ కార్పొరేష‌న్ F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. దీని ధ‌ర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్‌లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (రూ.169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (రూ.32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (రూ.58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (రూ.3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్‌ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే

పార్కింగ్‌ ఫీజు ఎంతంటే..?

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు రూ.2-3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 37 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు రూ. కోటి అంతకంటే ఎక్కువ అవుతుందనే అంచనా వేస్తున్నారు.

Leave a Reply