ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి హైమా కథనం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ ఘోర ఘటనకు ప్రత్యక్ష సాక్షి హైదరాబాదీ వాసి హైమా కథనం ఇది. ఆమె పుట్టపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు. ప్రమద ఘటన స్థలిలో ట్రాఫిక్ ఆగింది. బస్పు తగలబడిపోతున్న విషయం తెలిసి సాయం చేయటానికి హైమా వెళ్లారు. అక్కడ బస్సు తగలబడుతోంది. కొందరు బస్సు బయట ఏడుస్తున్నారు. ఫోన్ లు కాలిపోయాయి. మొబైల్ తో కొందరు వీడియోలు తీస్తున్నారు. వర్షం పడుతోంది. అక్కడ కాపాడే పరిస్థితి లేదు.
కర్నూలు ఎస్పీ.. స్పెషల్ బ్రాంచి ఆఫీసర్ కు హైమా ( Haima) ఫోన్ చేసారు. ఫైర్ సిబ్బంది. ఆంబులెన్స్ వచ్చాయి. అప్పటికే ఆరుగురుని ధర్మవరానికి చెందిన హరీష్ ప్రైవేటు వెహికల్ లో ఆసుపత్రికి తరలించారు. ఆంబులెన్ప్ లో కొంత మంది ఆసుపత్రికి వెళ్లారు. కర్నూలు రూరల్ సీఐ, ఎస్పీ ఘటన స్థలికి చేరుకున్నారు. నిజానికి ట్రాఫిక్ రద్దీలో.. పోలీసులు కూడా ప్రమాద స్థలికి రాలేపి స్థితి. ఇక అక్కడ పరిస్థితి వర్ణనాతీతం. బస్సు సీట్లల్లో కూర్చున్నోళ్లు కూర్చున్నట్టు మాంసం ముద్దలు గా మారిపోయిన మృతదేహాలు చూసి ప్రత్యక్ష సాక్షులు తట్టుకోలేక పోయారు. బస్సు సమీపంలో బైకర్ మృతదేహం ఉంది. బైక్ బస్సు కింద ఉంది. ఈ దృశ్యం కలచి వేసింది. అని ప్రత్యక్ష సాక్షి హైమా తెలిపారు.

