రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళల పొడిగింపు..

రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళల పొడిగింపు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 28, 30, 31 తేదీల్లో సాధారణంగా 10:30 గంటలకు నుండి 5 గంటల వరకు ఉండే కార్యాలయాల పని గంటలను ఉదయం 9:30 నుండి రాత్రి 8:30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటాయి.

Leave a Reply