శత్రు కదలికలపై నిరంతరం నిఘా
దేశం బయట, లోపల స్పెషల్ ఆపరేషన్స్
ప్రపంచ దేశాల్లో టాప్ ఫోర్లో భారత్ స్పై ఏజెన్సీ
గుఢచర్యంలో బెస్ట్‌గా నిలిచిన అజిత్ ధోవల్
ఆపరేషన్ బ్లూ స్టార్‌లో ఆటో డ్రైవర్ అవతారం
గోల్డెన్ టెంపుల్లో ముష్కరులకు చుక్కలు
ఖలిస్తాన్ అనే మాట వినపడకుండా చేసిన ధీరుడు
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చేపట్టిన టాప్ 10 మిషన్స్ ఇవే..
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
హాలీవుడ్ సినిమాల్లో చేతిలో గన్ను.. సాహసాలకు మారుపేరుగా నిలిచే జేమ్స్ బాండ్ 007 గురించి చాలామందికి తెలుసు. బాండ్ అంటే యునైటెడ్ కింగ్డామ్ (యూకే)కు చెందిన స్పై అన్నమాట. అయితే.. పలు దేశాలకు ప్రత్యేకంగా స్పై ఏజెన్సీస్ ఉన్నాయి. ఆయా దేశాల గూఢచారులంతా దేశం బయట జరిగే అతిపెద్ద కుట్రలను తిప్పికొట్టేందుకు సీక్రెట్‌గా వర్క్ చేస్తుంటారు. వారు చేసే పని మూడో కంటికి కూడా తెలియకుండా ఉంటుంది.. కూరగాయలు అమ్మేవారిగా, పూలు, పండ్లు, పాలు సప్లయ్ చేసే వారిగా.. పని మనుషులుగా కూడా స్పై ఏజెంట్స్ ఉంటారు. ఇందులో భారత్ స్పై ఏజెంట్‌గా అజిత్ ధోవల్ పాకిస్తాన్లో ఆరేండ్లపాటు ఎవరికీ అనుమానం రాకుండా గడిపిన పరిస్థితులున్నాయి. ఆ తర్వాత అక్కడి సీక్రెట్స్ తెలుసుకుని కొన్ని మిషన్స్ ఈజీగా సక్సెస్ చేసినట్టు తెలుస్తోంది.
ఆపదలో ఇతర దేశాలను ఆదుకునే రా ఏజెంట్స్..
దేశం లోపల రక్షణకు ఆర్మీ ఉన్నట్టే.. దేశం వెలుపల రక్షణ కోసం గూఢచారులు ఉంటారు. వారు పక్కదేశాల్లో అక్కడి పౌరుల మాదిరిగానే ఉండిపోయి.. కీలక రహస్యాలను కనిపెట్టి స్వదేశానికి మేలు చేస్తుంటారు. ఇట్లా.. అమెరికాకు CIA (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), ఇంగ్లండ్‌కు ఎంఐ6 (MI6), ఇజ్రాయెల్ మొస్సాద్ (Mossad), భారత్ రా (R & AW), రష్యాకు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB.. KGB), పాకిస్తాన్‌కు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) పేరుతో స్పై ఏజెన్సీస్ ఉన్నాయి. వీటిలో భారతదేశానికి చెందిన రా ఏజెన్సీ ప్రపంచంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. మన స్పై ఏజెన్సీ ఎన్నో కీలక ఆపరేషన్లను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. మనకే కాకుండా.. ఆపదలో ఉన్నాం కాపాడండి అని సాయంకోరిన పొరుగు దేశాలకూ చేయూతనందించి గొప్ప మనసును చాటుకుంది. ఇక.. పాకిస్తాన్ ఐఎస్ఐ మాదిరిగా చిల్లర పనులు చేయదు. పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐ పేరుకే కానీ, తీవ్రవాదులను తయారు చేసేందుకే ఎక్కువగా ఫోకస్ పెడుతుందని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉంది.
రా ఆపరేషన్లలో టాప్ 10 ఇవే..
1) ఆపరేషన్ బ్లూ స్టార్
ఖలితస్తాన్ ఉద్యమం పంజాబ్లో కేంద్రాన్ని కాదు.. దేశం మొత్తాన్ని చిరాకుపెట్టేది. ఎంతలా అంటే దేశంలో తీవ్రవాదం అనేదాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే.. వాళ్లు చేసిన తప్పు బహిరంగంగా గోల్డెన్ టెంపుల్లోకి చొరబడి అమాయకులను బందీలుగా చేసుకోవడమే. అప్పుడే రా రంగంలోకి దిగింది. వారి కుట్రలను గుర్తించలేక పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరోతో కాదని స్వయంగా రంగంలోకి దిగింది రా. నేటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఓ రిక్షా కార్మికుడి అవతారం ఎత్తారు. రిక్షా తొక్కుకుంటూ మెల్లిగా వారి అడ్డాలోకి ప్రవేశించారు. చేతిలో పాకిస్తాన్ పాస్పోర్టు, బొడ్డులో గన్నుతో యాక్షన్ సీన్లోకి దిగిపోయారు. తాను పాకిస్తాన్ స్పైనని వారిని నమ్మించి పాస్పోర్టు చూపించి దోస్తీ చేశారు. తీవ్రవాదులు అతన్ని పూర్తిగా నమ్మి గోల్డెన్ టెంపుల్లోకి తీసుకెళ్లారు. ఇక, ఆయన అక్కడి వాస్తవిక పరిస్థితిని సమీక్షిండమేకాకుండా. వారితో మాట్లాడి.. వారి నాయకుడు, ఆ ముఠాకు చెందిన మూలాలన్నీ తెలుసుకున్నారు. ఇట్లా.. జరిగిన స్పెషల్ ఆపరేషన్తో అమాయకుల ప్రాణాలను కాపాడిన ధోవల్.. ఆ తర్వాత ఆపరేషన్ను కమెండాలతో సక్సెస్ఫుల్గా పూర్తి చేయించారు. ఆయన ఇచ్చిన కీలక సమాచారంతో పంజాబ్లోని పోలీసులు, కమెండోలు తీవ్రవాదులను అరెస్టు చేసి చాప్టర్ చాప్టర్ లేపేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖలిస్తాన్ అనే పదమే దేశంలో ఎక్కడా వినపడలేదు.