వరుస ప్రమాదాలు.. విమానయాన సంస్థల నిర్వహణ తీరును ప్రశ్నిస్తున్నాయి. విమానయాన సంస్థలు.. తమ విమానాల నిర్వహణలో సాగుతున్న నిర్లక్ష్యపూర్వక వైఖరి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటోంది. నిత్యం ఏదో ఒక దుర్ఘటన చోటుచేసుకుంటుండగా.. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి… రైలు.. బస్సు ప్రమాదాల్లో మరణించిన వారి ఆచూకి.. కనీసం చివరిచూపు అయినా బాధిత కుటుంబాలకు దక్కుతుండగా.. విమాన ప్రమాదాల్లో మరణించిన వారి పేర్లు తప్ప.. కనీసం మృతదేహాలు లభ్యం కాని దయనీయ పరిస్థి తులు కలచివేస్తున్నాయి. వరుస ప్రమాదాలకు మానవ తప్పిదాలు.. విమానయాన సంస్థ ల నిర్లక్ష్యధోరణ? కారణం. అయినా విమానయాన సంస్థలు విమానాల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదన్నది ప్రశ్న. అంతర్జాతీయ విమాన సంస్థల తీరు ఇలా ఉంటే…దేశీయ విమాన సర్వీసుల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది.(
ఆంధ్రప్రభ, న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి
గాలిలో ప్రయాణం, గమ్యం చేరేందుకు తక్కువ సమయం, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు, ధర ఎక్కువైనా జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాల్సిందే. ఇది నిన్నమొన్నటి వరకు విమానయానం చేయాలనుకునే, చేస్తున్నవారి మాట. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. విమానంఢాకాలో కుప్పకూలిన జెట్ఎక్కాలంటేనే కాదు, దిగాలంటే కూడా అదృష్టు ఉండి తీరాలనే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలతో భయం వెన్నాడుతోంది. విమానయానం అంటే ఉలిక్కిపడేలా పరిస్థితి తయారైంది. సర్వీసుల్లో నిర్లక్ష్యాన్ని, భద్రతను ప్రశ్నిస్తున్నాయి.
ముఖ్యంగా ఒక సంఘటన నుంచి, తేరుకొనిజాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏవియేషన్ సేవల ప్రొవై డర్లు కాసులయావతో నిర్వహణ, ప్రజల ప్రాణాలను గాలికొది లేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విమా నాన్ని ప్రయాణానికి సిద్ధంచేసే ముందు విమానాల్లో చేయాల్సిన కనీస పరీక్షలను గాలికొదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో నిర్వాహకులు ఆటలాడుతున్నారన్న చర్చవణికిస్తున్న వరుస ఘటనలుసమాచార హక్కుచట్టం ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2025 మధ్యకాలంలో దేశంలో ప్రధానంగా దాదాపు 53 విమాన ప్రమాదాలు, 320కి పైగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోగా, జనం విమానం ఎక్కాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే నేల కూలింది. ఈ ప్రమాదంలో 242 మంది (230 ప్రయాణికులు, 12 సిబ్బం ది) మృత్యువాత పడ్డారు. వీరిలో 241 మంది చనిపోగా, వైద్య కళాశాలపై ఈ విమానం పడటంతో మరో 19మంది మెడికోలు మరణించారు.
ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది చనిపోగా, ఒక్క బ్రిటీష్ ప్రయాణికుడు మాత్రమే బతి కాడు. జూన్ 15న కేదార్నాథ్ నుండి గుప్త కాశీ వెళ్లిన విహా రయాత్రలో భాగంగా ప్రయాణించిన హెలికాప్టర్ గౌరికుంద్ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం ఏడుగురు (పైలట్, ఆరుగురు ప్రయాణికులు) మృతి చెందగా, హెలి కాప్టర్ పడిన ప్రాంతంలో మరొకరు మరణించారు.
జులై 16న ఇండిగో ఫ్లైట్ 6 ఈ-6271 ఢిల్లీ నుంచి గోవా వెళ్తుండగా, ఒక ఇంజిన్ మొరాయిం చడంతో అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ప్రాణ గండం తప్పింది. జులై 18న ఇండిగో ఫ్లైట్ 6ఈ-5118 ఢిల్లీ నుంచి ఇంఫాల్ తిరిగి వస్తుండగా, టేకాఫ్ తరువాత సాంకేతి కలోపం తలెత్తడంతో, తిరిగి ఢిల్లీలోనే అత్యవసరంగా ల్యాం డ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాక పోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ఇండిగో ఫ్లైట్ 6ఈ-2142 6271, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా, భారీ వడగండ్ల వాన కారణంగా పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి, అత్య వసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనలో విమానం ముం దుభాగం నుజ్జునుజ్జు కాగా, పెనుప్రమాదం తప్పింది. మార్చి 8న ఇండిగో ఫ్లైట్ 321 చెన్నయ్ ల్యాండింగ్ సమ యంలో రన్వేపై విమానం వెనుక భాగం ప్రమాదానికిగురైంది. ఈ ఘటనలోనూ ఎవరికీ ప్రాణహాని సంభవించక పోవడం కేవలం అదృష్టం.
ఇవే కాకుండా పౌర, శిక్షణ, సైనిక విమాన ప్రమాద సంఘటనలు అనేకం ఇటీవల చోటుచేసు క ఎన్నాయి. జులై 9న రాజస్థాన్లో ఐఏఎఫ్ జాగ్వార్ క్రాష్ జరిగి, ఇరువురు పైలట్లు మృత్యువాత పడ్డారు. ఐఏఎఫ్ జాగ్వార్ జెట్తో ఏఎన్-32 ఢీకొన్న ఘటన సంచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్లో శిక్షణ సందర్భంగా ఓ జెట్ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అయితే పైలట్లు సుర క్షితంగా బయటపడ్డారు. హర్యానాలో జాగ్వార్ జెట్ మిడైట్ ఫెయి ల్యూర్ కాగా, క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. ఇలా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
కాసుల కక్కుర్తే కారణం
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలకు, సర్వీ సింగ్ ఉపయోగిస్తున్న నాసిరకం విడి భాగాలే కారణ మన్న చర్చ జరుగు తోంది. ఏ కంపెనీ విమానాలకు ఆయా నిర్మాణ సంస్థల నుంచి విడిభాగాలు కొని, సర్వీసింగ్ చేయిం చాల్సి ఉండగా, ఖర్చుల నియంత్రణ పేరుతో నాసిరకం విడి భాగాలను వినియోగిస్తున్నట్లు విమర్శలున్నాయి. మరోవైపు సర్వీసింగ్ చేయాల్సిన సమయాన్ని పట్టించుకోవడం లేదు. నిర్దేశిత ప్రయాణ సమయం దాటినా విమానాల నిర్వహణ పట్టించుకోవడం లేదు.
అది ప్రమాదాలకు కారణమ వుతోంది. అంతేకాకుండా ఆయా విమానాల ప్రమాణాలను పరిశీలించాల్సిన డీజీసీఏ, కేవలం కాగితాల పరిశీలనకే పరి మితమై అనుమతుల నిచ్చేస్తోందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. నాణ్యతను ఏ విధంగా పరిశీలించాలన్న విషయాన్ని డీజీసీఏ వదిలే సిందని, విడిభాగాల నాణ్యతను నిర్వ హణ సంస్థలు పట్టించుకోకపోవడంతోనే సాంకేతిక స మస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నది నిపు ణులు చెబుతున్నారు.
నిర్వహణ తీరు మార్చాల్సిందే.!
ఆధునిక సాంకేతికత అరచేతిలోకి వచ్చిన తరుణం లోనూ వరుసగా జరుగుతున్న విమానయాన ప్రమా దాలు.. మాన వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నాయి. డీజీసీఏ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమా దాలను నివారించాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేపట్టడం లేదన్న చర్చ జరుగుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇలాంటి కీలకాంశలపై ఫోకస్ పెట్టాలని, కాసుల మత్తులో తూగుతూ, కనీస భద్రతా చర్యలు చేపట్టని విమానయాన సంస్థలపై చర్యలు తీసుకోవాలని, డీజీసీఏ నేతృత్వంలో అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే విమానాల టేకాఫక్కు అనుమతులనివ్వాలని పలువురు సూచిస్తున్నారు.
పరిశుభ్రతకూ పంగనామాలే
భారత విమానయాన సర్వీసులు కేవలం ఆదాయం పెంచు కొనేందుకే మొగ్గుచూపుతున్నాయన్న అపవాదును మూట గట్టుకుం టున్నాయి. విమానయాన సర్వీసులను కేవలం ధనార్జనకు షార్ట్ కట్ గా మార్చుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయాణీకులకు మౌలిక వసతులు, సౌక ర్యాలను పట్టించుకోవడం మానేసినట్లు ఆరోపణలు వినిపి స్తుండగా, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రైవేట్ బస్సుల తరహాలో ప్రయాణికులను దింపడం, తిరిగి ఎక్కించు కొని వెళ్లి పోవడం అన్నట్లుగా మారిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా విమాన సర్వీసుల్లో కనీస భద్రతా ప్రమాణాలు, పరిశు భ్రత పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలిం చకుండానే తిరిగి వినియోగిస్తుండటం విమర్శ లకు కారణమవుతోంది. కొన్ని సందర్భాల్లో దేశీయ విమాన సర్వీసుల్లో సీట్లను కూడా శుభ్రపరచడం లేదని పలువురు బాధితులు ‘ఆంధ్రప్రభ’ ఎదుట వాపో యారంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకొ “వచ్చు. ప్రైవేట్ బస్సులైనా నీట్ గా ఉంటాయని, విమానాలు అంతకంటే అధ్వాన్నంగా ఉంటున్నాయని వారు వాపో తుండటం గమనార్హం.
డీజీసీఏ ఏం చేస్తున్నట్లు?
పౌర విమానయాన రంగాన్ని నియంత్రించే ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియే షన్(డీజీసీఏ), ఇది భారత ప్రభుత్వ సామాన్య విమాన యాన మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ శాఖ విమాన భద్రత నియం త్రణలో పట్టు కోల్పో యిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విమా నాలు, విమానాశ్రయాలు, ఫ్లైట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, మె యింటెనెన్స్ సంస్థలు మొదలైన వాటికి నిబంధనలు విధిం చడం, పర్యవేక్షణ చేయడం ఈ సంస్థ విధి నిర్వహణలో ముఖ్యం కాగా, ఆయా వ్యవహారాల నుంచి డీజీసీఏ తప్పిం చుకుంటోందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
కేవలం కాసుల వసూళ్లకే పరిమితమై, పైలట్లు, ఇంజినీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మొదలైన వారికి లైసెన్సులు జారీ చేయడం, దేశంలో రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల నెంబర్, మదింపు, ప్రమాణాలను పరిశీలించాల్సి ఉండగా, లైసెన్స్ల జారీ తప్ప, మిగతా అంశాలపై పట్టుకోల్పోయిందన్న విమ ర్శలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు, ఇతర చిన్నచిన్న సంఘటనలపై ప్రాథమిక నివేదికలు రూపొందించడం, దుర్ఘటనలు జరిగితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సి డెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ఆధ్వర్యంలో విచారణ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగిన సందర్భం లో తప్ప, ఆ తదుపరి చర్యలను గాలికొది లేసిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
అంత ర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏవొ) విధిం చిన ప్రమాణాలను అమలు చేయాలని, అవసరమైతే సర్వీసులను నిలిపివేసి అయినా, ఆయా విమానాల భద్రతకు సంబంధించిన అన్నిరకాల పరీక్షలను నిర్వహించి, ఆ తదుపరి సర్వీసులకు అవకాశం కల్పించా లన్న డిమాండ్ వినిపిస్తోంది.