2కే రన్‌లో రాణించిన చల్లగరిగె యువకుడు

చిట్యాల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన 2కే రన్ పోటీల్లో మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన పోశాల రాకేష్ (17) ప్రతిభ కనబర్చాడు.

ఈ పరుగు పందెంలో రాకేష్ ద్వితీయ బహుమతి సాధించి ప్రశంసలు అందుకున్నాడు. విజేతకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బహుమతి ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ రాకేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply