Exams | విద్యార్థుల పరుగులు..

Exams | విద్యార్థుల పరుగులు..
Exams | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని కడప జిల్లా బి.కోడూరులోని పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము ప్రవేశించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పామును చూడగానే విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే పామును చంపి బయటపడేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో పరీక్షల నిర్వహణలో స్వల్ప అంతరాయం ఏర్పడింది.
