ప‌రీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి..

ప‌రీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి..

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో డిగ్రీ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయాలని పాలమూరు యూనివర్సిటీ(University) వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్‌లకు ఏబీవీపీ నాయకులు విజ్జప్తి చేశారు. ఈ రోజు పాలమూరు యూనివర్సిటీ మక్తల్ పట్టణంలో డిగ్రీ పరీక్షా కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వీసీ, రిజిస్ట్రార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్‌లను కలుసుకుని వివరించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ(ABVP) నాయకులు మాట్లాడుతూ.. మక్తల్ పట్టణంలో ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నప్పటికీ ఎగ్జామినేషన్‌కు మాత్రమే నారాయణపేట సెంటర్ ఉండడంతో విద్యార్థులు దూర ప్రయాణం చేసి ప‌రీక్ష రాయల్సివస్తుందన్నారు. ఈ విషయం పై గతంలో కూడా వినతి అందచేయడం జరిగిందని వీసీ(VC) దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అయితే మక్తల్ పరిసర గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. క్రిష్ణ, కున్సి, చెంగుట, అనుగొండ తదితర గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు సాయంత్రం బస్సు కూడా లేక పోవడంతో వారి గ్రామాలకు వెళ్ళడానికి తీవ్రంగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.

ఈ సమస్యలనిటినీ పాలమూరు యూనివర్సిటీ వీసీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి మక్తల్‌(Maktal)లో డిగ్రీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ(Naresh Teja), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్, నాయకులు క్రిష్ణ, రవి తేజ, వినయ్ కుమార్, భారత్, ప్రశాంత్, అనిల్, సందీప్, భాను తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply