Ex MLA | రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా.. పసుల కాపరిలా..

Ex MLA | రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా.. పసుల కాపరిలా..

  • హామీలు విస్మరించి దబాయించుడా..?
  • మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

Ex MLA | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా… పశువులు కాసే పశువుల కాపరిలా మాట్లాడుతున్నాడని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఇవాళ‌ యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చకుండా గాలిమాటలు మాట్లాడుతున్నారని చెప్పారు.

ప్రతిపక్ష నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అమలు చేయలేదని అడుగుతుంటే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్, కేటీఆర్ మీద చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రివి అని మరిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని బయట పెడుతున్న ప్రతిపక్ష నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదన్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేష్, మాజీ ఎంపీపీ బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, మాజీ ఎంపిటిసి పలుగుల నవీన్, బూఖ్య రవీందర్ నాయక్, రాజేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply