EX MLA | ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్

EX MLA | ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్

  • భువనగిరి లో విజయ దివాస్
  • మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

EX MLA | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : స్వరాష్ట్రం కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ (KCR) ఢిల్లీ మెడలు వంచిన రోజే విజయ దివాస్ అని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ భువనగిరి పట్టణ కేంద్రంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజును పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్పుల అమరేందర్, కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సూరజ్, మధు, తదితరులు పాల్గొన్నారు.

EX MLA
EX MLA

Leave a Reply