EX BRS MLA | వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు

EX BRS MLA | వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు
మాజీ విప్ బాల్క సుమన్
EX BRS MLA | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కోటపెల్లి బస్టాప్ వరకు అభివృద్ధి పేరుతో అధికారులు చేపడుతున్న రోడ్ వెడల్పు కార్యక్రమంలో ఆప్రాంతంలోని వ్యాపారస్తులకు నష్టం జరిగితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు వచ్చిన సుమన్ తెలుగు తల్లి, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పాలభిషేకం చేశారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన హయాంలో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసానని, ప్రజల, వ్యాపారాస్తుల కోరిక మేరకు రోడ్ వెడల్పు నిల్పివేసి మంచి పాలనను అందించానని ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి అభివృద్ధి పేరుతో వ్యాపారస్తుల భవనాలను కూల్చే విధంగా అధికారులకు ఆదేశాలు జారిచేసి చోద్యం చూస్తున్నారని ఏద్దేవా చేశారు. వ్యాపారస్తుల భవనాల నుంచి ఒక్క ఇటుక ముట్టుకున్నా.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
