పైసలిస్తేనే ఫైలు ముందుకు
.. అంతా అవినీతిమయం
.. పంచాయతీ కార్యదర్శుల అవినీతి లీలలు
.. ఏసీబీ కి పట్టు-బడుతున్న మారని తీరు
.. నెల రోజుల్లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పట్టివేత
.. కొరవడిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో (ఆంధ్ర ప్రభ ) :
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకతతో పాటు- అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని చెబుతుంటే..మరో వైపు అధికారులు సిబ్బంది తమతీరు మార్చుకోవడం లేదు. పలుచోట్ల ఏసీబీ దాడుల్లో పట్టు-బడ్డా.. కాసుల కోసం కక్కుర్తి పడతున్నారు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పల్లెల్లోని ప్రతి గడపకు చేర్చడంలో పంచాయతీ కార్యదర్శులది కీలకపాత్ర కాగా..వీరిలో కొందరు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తుంటే.. మరికొందరు అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. పనికో రేటు- చెబుతూ.. పైసలిస్తేనే దస్త్రాన్ని ముందుకు పంపిస్తు..కాసుల కోసం జలగల్లా పట్టి పీడిస్తూ.. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు..దీంతో ఏసీబీ కి వరుసగా పట్టు-బడుతున్నారు.
ప్రతి పనికీ పైసా అనేలా..!
పల్లెల ప్రగతికి కీలకమైన జిల్లా పంచాయతీ విభాగం తరచూ వివాదాస్పదమ వుతోంది. గ్రామాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే విషయంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవలంబిస్తున్న వైఖరి శాఖకు మచ్చ తెస్తోంది. ముఖ్యంగా కాసుల కక్కుర్తే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్న సందర్భాలు.. ఆమ్యామ్యాల కోసం ఆరాటాన్ని చూపిస్తున్న వైనాలు ఇటీ-వల జిల్లాలో చోటు- చేసుకుంటు-ండటం గమనార్హం.! ప్రతి పనికి అవసరమైన ధ్రువీకరణల జారీ విషయంలో పంచాయతీల పాత్ర కీలకం. ఇక ఊరికి వస్తున్న నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో ప్రజాప్రతినిధులతోపాటు- గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకున్న ఈ శాఖ సిబ్బంది వ్యవహరించే తీరు అత్యంత ప్రాధాన్యత కలిగినదే..
కొన్నిపంచాయతీల్లో పనిచేస్తున్న అధికారుల వ్యవహారం విమర్శలకు దారి తీస్తోంది. గ్రామపంచాయతీ పరిధిలో పౌర సేవా పట్టిక ప్రకారం జారీ చేసే అనుమతుల విషయంలో కొందరు మామూళ్లు అందితేనేగాని పత్రాన్ని అందించని పరిస్థితి కొన్నిచోట్ల నెలకొంది. ఇంటి అనుమతుల విషయం మొదలు.. గ్రామపరిధిలో వెంచర్ల ఏర్పాటు- విషయంలో కొన్ని పెద్ద పంచాయతీల చెంతన దండిగా దండుకుంటు-న్నారనే అభియోగాలున్నాయి. ఇలా చాలామందిపై ప్రజావాణిలో ఫిర్యాదులందిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది..
నెల రోజుల్లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పట్టివేత
గ్రామాల్లో సర్పంచి పాలన పూర్తయి ఏడాదిన్నర దాటింది. ప్రభుత్వం ప్రత్యేక అధికా రులను నియ మించినా వారిది వేర్వేరు శాఖల కావడం, పల్లె పాలనపై పట్టు-లే కపోవడం, మాతృశాఖ విధుల్లో నిమగ్నమై ఉండటంతో కొందరు కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై పర్యవే క్షణ కొరవడటంతో అవినీతికి పాల్పడుతున్నారు.నెల రోజుల కిందట వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ కార్య దర్శి ఇంటి నంబరు ఇవ్వడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసి.. ఏసీబీ కి పట్టుబడ్డాడు.
తాజాగా గంగాధర మండలం మధురానగర్ కార్యదర్శి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.10 వేలు లంచం అడిగి.. ఏసీబీ కి చిక్కాడు. నెల రోజుల్లో ఇద్దరు పంచా యతీ కార్యదర్శుల పట్టివేత తో నిజాయతీగా ఉండే ఉద్యోగులు ఇబ్బంది పడు తున్నారు.శంకరపట్నం మండలం లోని ఓ గ్రామానికి చెందిన ఒక నిరు పేద కుటు-ం బం ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా ఆ కార్యదర్శి ఆరు నెలలుగా సతా యించాడు. చేసేదిలేక బాధిత కుటు-ంబం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.
గంగాధర మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి స్థానిక నేతలతో కుమ్మ-కై-్క ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఇళ్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. ప్రజలు తీవ్ర ఆరోపణలు చేసి అతని పై ఒత్తిడి పెంచడంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. కరీంనగర్ గ్రామీణ మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చెరువు శిఖం భూమిలో రేకుల షెడ్లు నిర్మించుకోగా, కార్యదర్శి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోకుండా వాటికి ఇంటి నంబర్లు కేటాయించారు.

