Chennur | ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. సివిల్ జడ్జి రవి

చెన్నూర్, జులై 10(ఆంధ్రప్రభ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం (vanamahotsavam) లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి నట్లయితే భవితరాలకు స్వచ్చమైన వాయువును అందివ్వవచ్చని చెన్నూర్ (Chennur) మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి పర్వతనేని రవి అన్నారు.

అటవీ శాఖ (Forest Department) ఆధ్వర్యంలో వ‌న‌మహోత్సవం కార్యక్రమాన్ని గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రవి మొక్కలు నాటి మాట్లాడారు. ముందు తరాలకు స్వచ్ఛమైన వాయువు అందలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply