ADB | పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలి.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

జన్నారం, మే13 (ఆంధ్రప్రభ) : పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ ప్రతినిధులు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలు చేత పట్టుకుని మంగళవారం ఉదయం7 గంటలకు పాదయాత్రగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు.

ఆ తర్వాత రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికినీటి కాలువలను శుభ్రం చేస్తూ, రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారన్నారు. పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని ఆయన చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని, అలాంటప్పుడే ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ కన్వీనర్ రాహుల్ బాల్, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బేల్లయ్య నాయక్, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, శిక్షణ కోర్సు ఇన్చార్జి రానాప్రతాప్, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.కోటియానాయక్, రాష్ట్ర నాయకులు మల్లేశ్వరి, శ్రీకాంత్, శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజ్మీర నందునాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి, ఎం.రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, ముత్యం రాజన్న, ముత్యం సతీష్, లక్షెట్టిపేట మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, రాజన్న యాదవ్, ఇందయ్య, సుధీర్ కుమార్, సుధాకర్ నాయక్, గంగన్నయాదవ్, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, మౌలానా, హజార్, షాకీర్, ముజ్జు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply