Essentials | అవకాశం ఇవ్వండి…
- అభివృద్ధి చేసి చూపిస్తా
- సర్పంచ్ అభ్యర్థి మల్లెలవార్ సంగీత రాజు
Essentials | డోంగ్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే లక్ష్యమని, ఒకసారి అవకాశం ఇవ్వండని, డోంగ్లి మండలం కుర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మల్లెలవార్ సంగీత రాజు ప్రజలను అభ్యర్థించారు. గ్రామ ప్రజల నిత్యావసరాల(Essentials)పై తనకు పూర్తిగా అవగాహన ఉందని, తక్షణ స్పందనతో సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపుతానని మల్లెల్వర్ సంగీత రాజు తెలిపారు.
తాగునీరు, నాణ్యమైన వీధీ లైట్లు, సిమెంట్ రోడ్లు, స్వచ్ఛ గ్రామ పథకం అమలు, కాలువల మరమ్మతులు, చెత్త సేకరణకు నిరంతర సేవలు, వృద్ధులు వికలాంగుల(disabled)కు సులభమైన పింఛను సేవలు, మహిళా సంఘాల బలోపేతం వంటివి తన ప్రాధాన్యతల జాబితాలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామ యువతకు చిన్న వ్యాపారాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలలో సహాయం చేయాలని తమ ప్రణాళికలో ఉందని ఆమె తెలిపారు. గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామన్నారు.

