బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఇవాళ గాంధీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా పాల్గొన్నారు. ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు. గతంలో ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
