Entertainment | ప‌వ‌న్ స్వాగ్ చాలా ఇష్టం వీర‌మ‌ల్లు హిట్ కావాలి – నారా లోకేష్

వెల‌గ‌పూడి – ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి డిప్యూటీ సీఎం కూడా అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి నారా లోకేష్ ఏ చిన్న అవకాశం దొరికినా అన్నా అన్నా అంటూ పవన్ ను సంభోధిస్తూ అత్యంత దగ్గరగా కనిపిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు రేపు విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రులతో పాటు సినీ పరిశ్రమలో పలువురు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి నారా లోకేష్ కూడా పవన్ సినిమా హరి హర వీరమల్లుపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో పవన్ పై ఆయన అభిమానం మరోసారి కనిపించింది.

మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపారు. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ తనకు చాలా చాలా ఇష్టమన్నారు. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ లోకేష్ తన ట్వీట్ ముగించారు.

వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం ..

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈ మూవీపై చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై నిత్యం విరుచుకుప‌డే ఆయ‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అంబ‌టి ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. “పవన్ కల్యాణ్ గారి ‘హరిహర వీరమల్లు’ సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!” అని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే, ఒక‌వైపు వైసీపీ పార్టీ వారు ప‌వ‌న్ త‌న సొంత సినిమా కోసం టికెట్ ధ‌ర‌లు భారీగా పెంచేశార‌ని కామెంట్స్ చేస్తున్న స‌మ‌యంలో అంబ‌టి రాంబాబు పోస్టు ఇప్పుడు అటు సినీ ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం సినిమా సూపర్ డూపర్ హిట్టే అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply