ENG vs IND | ఇంగ్లండ్ టెస్ట్.. ఈరోజైనా నిలబడతారా..?

ఓవ‌ల్ : ఓవల్ టెస్టు (Oval Test) లో ఇక భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది. నిన్న ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగింపులో తొలి గంటలోనే 20రన్స్ మాత్రమే జోడించి 224 పరుగులకే ఇండియా ఆలౌటైంది. ఇవాళ అలా కాకుండా క్రీజులో నిలిచి, పరుగులు రాబట్టాలి. ఇంకా 3 రోజులు మ్యాచ్ మిగిలి ఉంది. ప్రస్తుతం 52 రన్స్ స్వల్ప ఆధిక్యంలో ఉన్న భారత్ (India) రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయాలి. అప్పుడే మ్యాచ్ పై పట్టు బిగించి, సిరీస్ సమం చేసే అవకాశం లభిస్తుంది.

ముగిసిన రెండో రోజు ఆట.. భారత లీడ్ ఎంతంటే..?
ఇంగ్లండ్ (England) కు 247కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ జైస్వాల్ (Opener Jaiswal) బౌండరీలతో ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరో ఓపెనర్ రాహుల్ (Rahul) (7), సాయి (Sai) (11) విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 రన్స్ చేసింది. 52 రన్స్ లీడ్ లో ఉంది. క్రీజులో జైస్వాల్ (51), నైట్ వాచ్మెన్ ఆకాశ్ (4) ఉన్నారు. మూడో రోజంతా బ్యాటింగ్ చేస్తే టీమ్ ఇండియా మ్యాచ్ పై పట్టు సాధిస్తుంది.

ఇదిలా ఉండగా బౌలింగ్ లో సి’రాజ్’ ENGతో టెస్టు సిరీస్ లో మియాభాయ్ సిరాజ్ (Siraj) అదరగొడుతున్నారు. బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ 4 వికెట్లు పడగొట్టి సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచారు. 18 వికెట్లు తీసి స్టోక్స్ (17)ను అధిగమించారు. మిగతా బౌలర్లు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే సిరాజ్ AUS టూర్లో 157.1 ఓవర్లు, ప్రస్తుత సిరీస్ లో ఇప్పటివరకు 155.2 ఓవర్లు వేయడం విశేషం.

సిరాజ్, ప్రసిద్ధ్ విజృంభణ..

సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా పుంజుకుంది. తొలి రోజు బ్యాటుతో మోస్తరు ప్రదర్శననే చేసినప్పటికీ.. రెండో రోజు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా (Team India)ను పోటీలోకి తెచ్చారు. లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్టు (Fifth Test) శుక్రవారం ఆసక్తికరంగా మారింది. ముందుగా శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరుతో 204/6తో ఆట కొనసాగించిన టీమిండియా ఆట ఎంతో సేపు సాగలేదు.

224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ (England) కూడా తడబడింది. సిరాజ్(4/86), ప్రసిద్ధ్ కృష్ణ (4/62) విజృంభించడంతో ఆతిథ్య జట్టు 247 రన్స్‌కే కుప్పకూలింది. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 43 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజే రెండో ఇన్నింగ్స్ (Second innings) కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(7), సాయి సుదర్శన్(11) మరోసారి నిరాశపరిచారు. యశస్వి జైశ్వాల్(51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడుతున్న అతను ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించాడు. అతనితోపాటు ఆకాశ్ దీప్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల లీడ్‌లో ఉంది.

Leave a Reply