వాక్ మారథాన్ లో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

వాక్ మారథాన్ లో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

  • * పొగ పీల్చొద్దు
    * మద్యం తాగొద్దు
    * బరువు పెంచొద్దు
    * హాయిగా నడుద్దాం
    * గుండెను ప్రేమిద్దాం…కాపాడుదాం

( ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో ) గుండెను ప్రేమిద్దాం, ఆర్యోగ్యాన్ని కాపాడుకుందాం, కలకాలం హాయిగా జీవిద్దాం అని ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ పిలుపునిచ్చారు ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ఆశ్రమ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏలూరు జూటు మిల్లు ప్రాంతం నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు వాక్ మార్తాన్ కార్యక్రమానికి నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ముఖ్య అతిథిగా జూట్ మిల్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు వాక్ మార్తాన్ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, మొత్తం ఆరోగ్యం శ్రేయస్సుకు గుండె కీలకం. ఆ గుండెను పదిలం చేయాలి. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం నాడు, మన గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి మన చుట్టూ ఉన్నవారికి గుండె ఆరోగ్యం , ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యకర గుండెతో, మనం ఆరోగ్యకర సంతోషకర జీవితాన్ని గడపగలం. అని, ప్రతి ఒక్కరూ రోజుకి 10,000 అడుగుల చొప్పున నడిచి మీ గుండెను ప్రేమించండి అది జీవితకాలం మిమ్మల్ని ప్రేమించి ఆరాధిస్తుందని హితవు పలికారు. ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం నినాదం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, ఇది నిర్దిష్ట ఆరోగ్య సమస్యలపై దృష్టి సారిస్తుంది. అయితే, ముఖ్య సందేశం ఎప్పుడూ ఒకటే – “మీ గుండెను ప్రేమించండి, దానిని జాగ్రత్తగా చూసుకోండి!”

మీ గుండెను ఇలా కాపాడండి

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ,ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మధ్యస్థ తీవ్రత కలిగిన వ్యాయామం చేయండి. నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటివి గుండె ఆరోగ్యానికి మంచివి.

పొగ తాగొద్దు.. లిక్కరు అసలు వద్దు

ధూమపానం , అధిక మద్యపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. వీటిని పూర్తిగా మానేయడం లేదా పరిమితం చేయడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయం గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఆరోగ్యకర బరువును నిర్వహించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్రమం తప్పకుండా రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయించుకోండి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందులు వాడండి. మీకు మధుమేహం ఉంటే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. యోగా, ధ్యానం,శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. సంవత్సరానికి ఒకసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవచ్చు. ఈ వాక్ మార్తాన్ లో ఆశ్రమ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హనుమంతరావు, సి ఓ వో డాక్టర్ రాజ రాజన్, డాక్టర్ తమ్మీరాజు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్ బి ఇన్స్ పెక్టర్ మల్లేశ్వర రావు, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది, ఏలూరు వాకర్ అసోసియేషన్ సభ్యులు ఆశ్రమ వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply